Babar Azam: బ్యాటుతో వెంటపడ్డ బాబర్.. మైదానంలో రిజ్వాన్ పరుగోపరుగు.. వీడియో ఇదిగో!

Babar Azam Chases Mohammad Rizwan With Bat In Hand
షార్ట్స్‌లో చూడండి
పాకిస్థాన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ మైదానంలో చేసిన పనికి ఆయన అభిమానులు కడుపుబ్బా నవ్వుతున్నారు. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ను కొట్టేందుకు బ్యాట్ తో వెంటపడడం.. బాబర్ కు అందకుండా రిజ్వాన్ పరుగులు పెట్టడమే దీనికి కారణం. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాలు.. దేశవాళీ మ్యాచ్ లో బాబర్ అజామ్ బ్యాటింగ్ చేస్తుండగా, మహ్మద్ రిజ్వాన్ కీపింగ్ చేస్తున్నాడు.

ఓ వైడ్ బాల్ తర్వాత బాబర్ క్రీజులో నుంచి బయటకు వచ్చాడు.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న బ్యాట్స్ మన్ తో మాట్లాడేందుకు వెళ్లాడు. ఇంతలో బాల్ అందుకున్న కీపర్ రిజ్వాన్ వికెట్లను గిరాటేసి, లెగ్ ఎంపైర్ కు అప్పీల్ చేశాడు. ఈ అప్పీల్ ను లెగ్ ఎంపైర్ తిరస్కరించాడు. ఇదంతా గమనించిన బాబర్.. తన బ్యాట్ తో రిజ్వాన్ వెంటపడ్డాడు. కొడతానన్నట్లు బ్యాటును ఎత్తి మరీ మీదికి రావడంతో రిజ్వాన్ పరుగందుకున్నాడు. ఈ సరదా సన్నివేశానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
Go Back to Shorts
Babar Azam
Mohammad Rizwan
Chase
Pak cricket
Viral Videos
Cricket match
sports

More Telugu News