రోడ్డు ప్రమాదం.. బాధితుడిని కాపాడిన ముహమ్మద్ షమీ
- నైనిటాల్ ఘాట్ రోడ్డులో ప్రమాదం
- అదుపు కోల్పోయి ప్రమాదంలో పడ్డ కారు
- క్షతగాత్రుడిని కాపాడిన షమీ, సోషల్ మీడియాలో ఘటన గురించి వెల్లడి
ఇటీవల జరిగిన వరల్డ్ కప్‌లో ముహమ్మద్ షమీ భారత్ తరపున అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. టోర్నీలో నాలుగు మ్యాచ్‌ల తరువాత బరిలోకి దిగిన అతడు ఏకంగా 24 వికెట్లు తీసి అదరగొట్టాడు. అయితే, ఫైనల్స్‌లో మాత్రం ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ప్రపంచ విజేతగా నిలిచింది.