Prakash Raj: యుద్ధ విమానంలో మోదీ గగన విహారంపై ప్రకాశ్ రాజ్ సెటైర్

Prakash Raj satire on Modi Tejas ride
షార్ట్స్‌లో చూడండి
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విధానాలను, ప్రధాని నరేంద్ర మోదీని నటుడు ప్రకాశ్ రాజ్ నిశితంగా విమర్శిస్తుండడం తెలిసిందే. జస్ట్ ఆస్కింగ్ యాష్ ట్యాగ్ తో ఆయన మోదీపైనా, బీజేపీపైనా వ్యంగ్యాస్త్రాలు సంధిస్తుంటారు. 

ఇవాళ ప్రధాని మోదీ బెంగళూరులో తేజాస్ యుద్ధ విమానంలో గగన విహారం చేయడంపైనా ప్రకాశ్ రాజ్ స్పందించారు. నెక్ట్స్ ఏంటి... జలాంతర్గామిలో ప్రయాణించడమేనా? అంటూ మోదీపై సెటైర్ వేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ వాయు విహారం ఫొటోలను పంచుకుంటూ ట్వీట్ చేశారు. 

కాగా, ప్రకాశ్ రాజ్ ట్వీట్ పై నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ప్రధాని మోదీ ఇక యూఎఫ్ఓ (గ్రహాంతర జీవుల వాహనం)లో ప్రయాణించడమే తరువాయి అని వ్యాఖ్యానించాడు. మరికొందరు, ప్రకాశ్ రాజ్ పై నమోదైన ఈడీ కేసును ప్రస్తావించారు. ఈడీ ప్రస్తావన తెస్తూ ప్రకాశ్ రాజ్ ను ఎత్తిపొడిచారు.
Go Back to Shorts
Prakash Raj
Narendra Modi
Tejas
Fighter Craft

More Telugu News