విశాఖలో స్కూల్ ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు.. వీడియో ఇదిగో!
- 8 మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు
- బుధవారం ఉదయం స్కూలుకు వెళుతుండగా ప్రమాదం
- బోల్తా పడిన ఆటో.. రోడ్డుపై పడిపోయిన చిన్నారులు
విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రక్కు, మరో సైడ్ నుంచి వస్తున్న స్కూలు పిల్లల ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటో రెండు చుట్లు తిరిగి బోల్తా పడింది. లోపల ఉన్న స్కూలు పిల్లలు ఎగిరి బయటపడ్డారు. గాయాలపాలైన చిన్నారులను స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ట్రక్కు డ్రైవర్, క్లీనర్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, గాయపడ్డ విద్యార్థులలో ఇద్దరి పరిస్థితి సీరియస్ గా ఉందని, మిగతా పిల్లల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. ప్రమాద విషయం తెలిసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆసుపత్రికి పరుగులు పెట్టారు. గాయాలతో ఆసుపత్రి బెడ్ మీద ఉన్న చిన్నారులను చూసి కంటతడి పెట్టారు.