కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం

Road accident on Kotappakonda ghat road
  • ప్రమాద సమయంలో వాహనంలో 13 మంది ప్రయాణికులు
  • ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు
  • బాధితులు నంద్యాల జిల్లా గాజులపల్లికి చెందిన వారు
ఏపీలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం కోటప్పకొండ ఘాట్ రోడ్డుపై ప్రమాదం సంభవించింది. నంద్యాల జిల్లా గాజులపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబం వాహనంలో కోటప్పకొండకు వెళ్తుండగా... ఘాట్ రోడ్డులో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 13 మందితో పాటు వంట సామగ్రి, బ్యాగులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించారు. క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సరైన సమయానికి వైద్యం అందడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఎవరికీ ప్రాణహాని లేదని వైద్యులు తెలిపారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. మరోవైపు పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. క్షతగాత్రులు, బాధితుల నుంచి ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరించారు. 
Go Back to Shorts
Kotappakonda
Ghat Road
Road Accident

More Telugu News