Bigg Boss: నేను శివాజీ భజన చేశాననడం కరెక్టు కాదు: బిగ్ బాస్ భోలే షావలి

'బిగ్ బాస్ హౌస్' నుంచి ఆదివారం రోజున భోలే షా వలి బయటికి వచ్చేశాడు. తాజాగా ఒక యూ ట్యూబ్ ఛానల్ తో ఆయన మాట్లాడుతూ .. "హౌస్ లో నాదైన మార్క్ చూపించడం కోసం వెళ్లాను. ఎవరినీ అనుకరించే ప్రయత్నం నేను చేయలేదు. నామినేషన్స్ సమయంలో కావాలని నేను వెటకారంగా మాట్లాడలేదు .. నా బాడీ లాంగ్వేజ్ అంతే" అన్నాడు. 

"నేను వైల్డ్ కార్డు ఎంట్రీపై వెళ్లాను. అలా అని నేను ప్లాన్ చేసుకుని వెళ్లానని అనడం కరెక్టు కాదు. నేను బయట ఎలాగైతే ఉంటానో .. హౌస్ లో కూడా అలాగే ఉన్నాను. నేను శివాజీని పొగిడాను .. ఆయన భజన చేశాను అనడంలో నిజం లేదు. శివాజీ మంచి మనసున్నవాడు అని చెప్పాను అంతే" అని అన్నాడు. 

" నిజంగానే శివాజీ చాలా జన్యూన్ .. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. వీలైతే మంచి సలహాలు ఇస్తాడు .. లేదంటే సైలెంట్ గా కూర్చుంటాడు. టాస్కుల సమయంలో శివాజీ తన చేయి నొప్పిని కూడా లెక్కచేయలేదు. ఆయనకి అసలు దెబ్బ తగల్లేదు అనడం కరెక్టు కాదు. ఆయన ఎన్ని మందులు వాడాడన్నది నేను చూశాను" అని చెప్పాడు. 

Bigg Boss
Bhole Shavali
Shivaji

More Telugu News