ఓటేసి గెలిపిస్తే రూపాయికే నాలుగు సిలిండర్లు అందిస్తాడట.. అభ్యర్థి హామీ!
- విద్య, వైద్యం, న్యాయ సలహాలు.. ఏదైనాసరే ఒక్క రూపాయికే ఇస్తా
- ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ నేత ఎన్నికల హామీలు
- సనత్ నగర్ నుంచి పోటీ చేస్తున్న కుమ్మరి వెంకటేశ్ యాదవ్
ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ టికెట్ పై కుమ్మరి వెంకటేశ్ యాదవ్ సనత్ నగర్ బరిలో నిలిచాడు. ఇక్కడ అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రస్తుత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఉన్నతవిద్యావంతురాలు, డాక్టర్ కోట నీలిమ పోటీ చేస్తున్నారు. వీరితో పోటీపడుతున్న వెంకటేశ్.. వినూత్నంగా ప్రచారం చేస్తున్నాడు. గ్యాస్ సిలిండర్ ధరను ప్రధాన పార్టీలు పోటాపోటీగా తగ్గిస్తుంటే.. ఇక ఇంతకుమించి తగ్గించలేరనేలా ఏకంగా రూపాయికే నాలుగు సిలిండర్లు అందిస్తానని ప్రకటించాడు. అసాధ్యమైన హామీలతో కుమ్మరి వెంకటేశ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్నాడు.