గిల్ సెంచరీ మిస్సవ్వడంపై సారా టెండూల్కర్ రియాక్షన్.. ఫొటో వైరల్
- అనూహ్యంగా సెంచరీ చేజారడంతో నిరాశకు లోనైన సచిన్ కూతురు
- కొద్దిక్షణాల్లోనే నిలబడి చప్పట్లు కొడుతూ గిల్‌కు అభినందనలు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు
సెంచరీకి చేరువైన తరుణంలో అనూహ్యంగా గిల్ ఔట్ అవ్వడం సారా నిరాశకు లోనైనట్టు కనిపించింది. రెండు చేతులు నోటిమీద వేసుకొని ‘అయ్యో..’ అనే రియాక్షన్ ఇచ్చారు. అయితే కొద్ది క్షణాల్లో నిలబడి చప్పట్లతో గిల్‌ని అభినందిస్తూ ఆమె కనిపించారు. ఈ దృశ్యానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. శుభ్‌మన్ గిల్, సారా టెండూల్కర్ మధ్య ప్రేమాయణం నడుస్తోందని కొంతకాలం ఊహాగానాలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆమె రియాక్షన్స్‌కు ప్రాధాన్యత దక్కింది.