గాజా నగరాన్ని సంపూర్ణంగా చుట్టుముట్టాం: ఇజ్రాయెల్ సైన్యం ప్రకటన
- నగరం చుట్టూ సైన్యం మోహరించినట్టు ప్రకటన
- మిలిటరీ ప్రతినిధి డేనియల్ హగారీ వెల్లడి
- గ్రౌండ్ లెవల్ ఆపరేషన్లను మరింత ఉధృతం చేసిన ఇజ్రాయెల్
కాగా వారం రోజులుగా గాజాపై దాడులను ఇజ్రాయెల్ మరింత ఉధృతం చేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి ఇజ్రాయెల్ దళాలు భీకర భూయుద్ధాన్ని కొనసాగిస్తున్నాయి. ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా దాడులు జరుపుతున్నాయి. దాడులు ఆపాలంటూ విజ్ఞప్తులను ఆ దేశం పట్టించుకోవడం లేదు. కాల్పుల విరమణ గురించి ప్రస్తుతం తాము ఆలోచించడం లేదని డేనియల్ హగారీ స్పష్టం చేశారు.