హైదరాబాద్‌లో ఐటీ సోదాల కలకలం.. కాంగ్రెస్ నాయకుల ఇళ్లలో తనిఖీలు
- బాలాపూర్‌లోని చిగిరింత పారిజాత నివాసంతోపాటు మరో 10 చోట్ల తనిఖీలు
- మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ సోదాలు
- మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ కొనసాగుతున్న తనిఖీలు
- పారిజాత కుమార్తె ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న అధికారులు
గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వేలంలో బాలపూర్ లడ్డూను దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే, మరికొందరి ఇళ్లు, కార్యాలయాల్లోనూ ఐటీ తనిఖీలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార, విపక్ష నాయకుల ఇళ్లలో సోదాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.