Mohan Babu: మంచు విష్ణు ఆరోగ్యంపై మోహన్ బాబు హెల్త్‌ అప్‌డేట్

Mohan babu says Vishnu is on road to recovery
షార్ట్స్‌లో చూడండి
న్యూజిలాండ్‌లో ‘కన్నప్ప’ సినిమా షూటింగ్‌లో జరిగిన ప్రమాదంలో హీరో మంచు విష్ణు చేతికి గాయమైన విషయం తెలిసిందే. అయితే, విష్ణు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తండ్రి మోహన్‌బాబు తాజాగా అప్‌డేట్ ఇచ్చారు. ప్రస్తుతం విష్ణు కోలుకుంటున్నాడని ఎక్స్ వేదికగా వెల్లడించారు. తమకు అండగా నిలిచిన వారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా పేర్కొన్నారు. 

కన్నప్ప మూవీ తన డ్రీమ్ ప్రాజెక్టు అని విష్ణు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మారు హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్న విష్ణు ఈ ప్రాజెక్టును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు స్వయంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, కన్నడ హీరో శివకుమార్, లేడీ సూపర్ స్టార్ నయనతార కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Go Back to Shorts
Mohan Babu
Manchu Vishnu

More Telugu News