రామ్ చరణ్, బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్... ఇద్దరి మధ్య ఫన్నీ మూమెంట్స్

Ram Charan Buchi Babu Long Drive Discussion About Peddi Movie
  • జూన్ 4న థియేటర్‌లలో పెద్ది సినిమా
  • ఈ నెల 18న పెద్ది ట్రైలర్ విడుదల
  • పెద్ది సినిమా చాలా బాగుంటుందన్న బుచ్చిబాబు
పెద్ది ప్రమోషన్స్ ఊపందుకుంటున్నాయి. తాజాగా హీరో రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు లాంగ్ డ్రైవ్‌కు వెళ్లారు. చెర్రీ హీరోగా, బుచ్చిబాబు దర్శకత్వంలో 'పెద్ది' చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా వచ్చే నెల 4వ తేదీన విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారంలో జోరు పెంచింది. ఇందులో భాగంగా రామ్ చరణ్, బుచ్చిబాబు కలిసి లాంగ్ డ్రైవ్‌కు వెళ్ళారు. ఈ సమయంలో వారు 'పెద్ది' చిత్రం విడుదల, ట్రైలర్ విడుదల గురించి మాట్లాడుకున్నారు.

బిజీ షెడ్యూల్‌లో తనను రామ్ చరణ్ డ్రైవ్‌కు తీసుకువచ్చాడని బుచ్చిబాబు పేర్కొన్నారు. ఇందుకు రామ్ చరణ్‌కు ధన్యవాదాలు తెలియజేశారు.

అయితే సినిమా కచ్చితంగా ఎప్పుడు విడుదలవుతుందో చెప్పాలని రామ్ చరణ్ అడగడంతో, బుచ్చిబాబు స్పందిస్తూ, జూన్ 4న థియేటర్‌లలోకి వస్తుందని అన్నారు.

ట్రైలర్ కూడా ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పాలని రామ్ చరణ్ అడగ్గా... ఈ నెల 18న విడుదల చేస్తామని బుచ్చిబాబు సమాధానం చెప్పారు. పక్కాగా విడుదల చేస్తారా? అని రామ్ చరణ్ మరోసారి ప్రశ్నించగా, తప్పకుండా విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

బుచ్చిబాబు మాట్లాడుతూ, పెద్ది సినిమా చాలా బాగుంటుందని అన్నారు. ఇద్దరం ఎంతో మనసు పెట్టి దీనిని పూర్తి చేశామని అన్నారు. రామ్ చరణ్ పెద్ద స్టార్, ఆయన వద్దకు 'పెద్ది' వంటి మంచి కథతో వెళితే వెంటనే అంగీకరించారని తెలిపారు.
Go Back to Shorts
Ram Charan
Buchi Babu
Peddi Movie
Telugu Cinema
June 4 Release
Trailer Release Date
Long Drive

More Telugu News