Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చంద్రబాబు బెయిల్ పిటిషన్.. నాట్ బిఫోర్ మీ అన్న హైకోర్టు న్యాయమూర్తి

HC Justice Jyothirmayi says not before me in Chandrababu bail petition
Advertisement
  • వెకేషన్ బెంచ్ ముందుకు  చంద్రబాబు బెయిల్ పిటిషన్
  • నాట్ బిఫోర్ మీ చెప్పిన జస్టిస్ జ్యోతిర్మయి
  • పిటిషన్ ను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీకి ఆదేశం
Advertisement
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ కు సంబంధించిన హౌస్ మోషన్ పిటిషన్ విచారణ నేడు ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ముందుకు వచ్చింది. ఈ పిటిషన్ జస్టిస్ జ్యోతిర్మయి ప్రతాప బెంచ్ ముందుకు 8వ కేసుగా వచ్చింది. అయితే ఈ కేసును విచారించేందుకు న్యాయమూర్తి సుముఖత చూపలేదు. నాట్ బిఫోర్ మీ చెప్పారు. పిటిషన్ విచారణను చీఫ్ జస్టిస్ ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు. తదుపరి విచారణను ఈనెల 30కి వాయిదా వేశారు. చంద్రబాబు ఆరోగ్య కారణాల రీత్యా ప్రత్యామ్నాయ మార్గాలకు తన నిర్ణయం అడ్డురాదని జడ్జి తెలిపారు.
Advertisement
Advertisement
Chandrababu
Telugudesam
Skill Development Case
Bail

More Telugu News