మీడియాకు క్షమాపణలు చెప్పిన యాంకర్ సుమ.. ఎందుకంటే..!
- స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని విలేకర్లపై వివాదాస్పద వ్యాఖ్యలు
- నిండు మనసుతో క్షమించాలని అభ్యర్థన
- ఈ మేరకు వీడియో విడుదల చేసిన యాంకర్ సుమ
కాగా బుధవారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ‘లీలమ్మో’ పాట విడుదల వేదికపై కూడా సుమ క్షమాపణలు కోరారు. ఈ ఈవెంట్‌కి యాంకర్‌గా వ్యవహరించిన సుమ ఓ సందర్భంలో ‘మీడియావారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారు’ అని ఆమె అన్నారు. అక్కడే ఉన్న ఓ మీడియా ప్రతినిధి ఈ వ్యాఖ్యలను ఖండించారు. అలా అనొద్దని అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో చాలాకాలంగా ఉన్న చనువుతోనే ఈ వ్యాఖ్యలు చేశానని, క్షమించాలని అదే వేదికపై ఆమె కోరిన విషయం తెలిసిందే.