జపాన్‌లో ఘనంగా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు.. పూజలు, ప్రసాదాలు కూడా!

Prabhas birthday celebrations in Japan
  • ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు
  • జపాన్ లో కూడా ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్
  • గదినిండా ప్రభాస్ ఫొటోలు పెట్టి పూజలు
రెబల్ స్టార్ ప్రభాస్ కు ఇండియాలోనే కాదు... పలు దేశాల్లో కూడా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో భారీ ఫాలోయింగ్ ఉంది. 'బాహుబలి' 'సాహో' సినిమాలతో అక్కడ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఈరోజు ప్రభాస్ పుట్టినరోజు. ఆయన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

ఇక జపాన్ లో కూడా ఇండియన్ అభిమానులను మించిపోయి ప్రభాస్ పుట్టినరోజును సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. గది నిండా ప్రభాస్ బొమ్మలు, ఫొటోలు పెట్టి పూజలు చేస్తున్నారు. తెలుగు ప్రసాదాలు పులిహోర, గారెలు, కేసరి వంటివి ప్రభాస్ కు నైవేద్యంగా పెడుతున్నారు. సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. వీరిలో ఎక్కువగా మహిళా అభిమానులు ఉన్నారు. మరోవైపు ప్రభాస్ కు అక్కడ భారీ ఫాలోయింగ్ ఉండటంతో... ఆయన పేరుతో కొన్ని వస్తువులను కూడా మార్కెట్లోకి రిలీజ్ చేశారు.
Go Back to Shorts
Prabhas
Birthday
Japan

More Telugu News