రోగులతో నిండిపోతున్న ఆసుపత్రులు.. తెలంగాణలో న్యుమోనియా విశ్వరూపం
- హైదరాబాద్ సహా రాష్ట్రమంతా న్యూమోనియా
- జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు వంటివన్నీ న్యుమోనియా లక్షణాలే
- దగ్గు, తుమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు సంక్రమణ
- జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యులు
న్యుమోనియా బారినపడేవారిలో జలుబు, జ్వరం, కండరాల నొప్పులు, దగ్గు, తలనొప్పి, చెమటలు పట్టడం, వికారం, వాంతులు, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగుల నుంచి ఇది దగ్గు, తమ్ములు, నోటి తుంపర్ల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుందని, కాబట్టి రోగులు మాస్కు ధరించాలని వైద్యులు తెలిపారు. పై లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.