అలాంటి తప్పు కోహ్లీ ఎప్పుడూ చేయడు.. సునీల్ గవాస్కర్
- సెంచరీ చేయడంపై దృష్టి పెట్టాలని గిల్, అయ్యర్ కు సూచన
- బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఔటైన తీరుపై అసంతృప్తి
- సహనం కోల్పోయి వికెట్ పారేసుకుంటున్నారన్న గవాస్కర్
వ్యక్తిగత స్కోరు 70, 80 చేరినపుడు విరాట్ కోహ్లీ సెంచరీ సాధించడంపై దృష్టి పెడతాడని, వికెట్ ను మరింత జాగ్రత్తగా కాపాడుకుంటాడని గవాస్కర్ చెప్పారు. మిగతా సందర్భాలలోనూ అంత తేలికగా సహనం కోల్పోడని ప్రశంసించారు. కోహ్లీ వికెట్ కోసం బౌలర్లు చాలా శ్రమించాల్సి ఉంటుందన్నారు. భారీ స్కోర్ సాధించడానికి ఇదే మంచి పద్ధతి అని తెలిపారు. ఈ విషయాన్ని గుర్తించాలంటూ శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లకు హితవు పలికారు. వచ్చిన అవకాశాలను వదులుకుంటే మళ్లీ రావని గవాస్కర్ వారిని హెచ్చరించారు.