హమాస్ తో కలిసి పోరాడేందుకు పవార్ తన కూతురును పంపిస్తాడేమో!: అసోం ముఖ్యమంత్రి వ్యంగ్యం
- ఇజ్రాయెల్ కు ప్రధాని మోదీ మద్దతు పలకడాన్ని తప్పుబట్టిన పవార్
- మిలిటెంట్లకు మద్దతుగా నిలబడాలా అంటూ ప్రశ్నించిన హిమంత బిశ్వ శర్మ
- టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడతారని ఊహించలేదన్న పీయూష్ గోయెల్
ఈ వ్యాఖ్యలపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తీవ్రంగా స్పందించారు. హమాస్ మిలిటెంట్లకు మద్దతుగా పవార్ తన కూతురును పంపిస్తాడేమో అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ స్పందిస్తూ.. ప్రపంచంలో టెర్రరిజం ఏ రూపంలో ఉన్నా ఖండించాల్సిందేనని స్పష్టం చేశారు. ఓ సీనియర్ పొలిటికల్ లీడర్ అయిన శరద్ పవార్.. టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడతారని ఊహించలేదని చెప్పారు. దేశానికి రక్షణ మంత్రిగా, ఓ రాష్ట్రానికి పలుమార్లు ముఖ్యమంత్రిగా చేసిన నేత ఇలా మిలిటెంట్లకు అనుకూలంగా మాట్లాడటమేంటని ప్రశ్నిస్తూ గోయెల్ ట్వీట్ చేశారు.