టీమిండియాలో నెక్స్ట్ ధోనీ ఇతనే: సురేశ్ రైనా
- రోహిత్ శర్మ గొప్ప కెప్టెన్ అని కితాబునిచ్చిన రైనా
- డ్రెస్సింగ్ రూమ్ లో రోహిత్ ను తోటి ఆటగాళ్లు ఎంతో గౌరవిస్తారని వెల్లడి
- టీమ్ లో నెక్స్ట్ ధోనీ రోహిత్ అని వ్యాఖ్య
రోహిత్ చాలా కూల్ గా ఉంటాడని... ప్రతి ఆటగాడి అభిప్రాయాలను శ్రద్ధగా వింటాడని రైనా చెప్పాడు. ఫామ్ లో లేని ప్లేయర్లలో కూడా నమ్మకాన్ని నింపి, వాళ్లు బాగా ఆడేలా చేస్తాడని తెలిపాడు. టీమ్ ను ముందుండి నడిపించేందుకు ఇష్టపడతాడని చెప్పాడు. ప్లేయర్ గా కూడా రోహిత్ అద్భుత ప్రదర్శన చేస్తాడని... కెప్టెన్ బాగా ఆడితే డ్రెస్సింగ్ రూమ్ లో అతనిపై గౌరవం ఆటోమేటిక్ గా పెరుగుతుందని అన్నాడు. టీమిండియాలో నెక్స్ట్ ధోనీ ఎవరని తనను ఎవరైనా అడిగితే... తాను రోహిత్ శర్మ పేరే చెపుతానని వ్యాఖ్యానించారు. ఇండియన్ టీమ్ లో మరో ధోనీ రోహిత్ అని అన్నాడు.