మరికాసేపట్లో తెలంగాణ భవన్ కు కేసీఆర్
- ఒక్కొక్కరిగా చేరుకుంటున్న నేతలు
- మధ్యాహ్నం పార్టీ మేనిఫెస్టో విడుదల
- అభ్యర్థులకు బీఫామ్ అందజేయనున్న సీఎం
తెలంగాణ భవన్ వద్ద మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని.. ఈ రోజు విడుదల చేయబోయే మేనిఫెస్టోలో ప్రజల సంక్షేమానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఎలాంటి హామీ ఇవ్వని అంశాలనూ ఆయన చేసి చూపిస్తారని వివరించారు. ఈ విషయం ప్రజలకు కూడా తెలుసని, రాష్ట్ర ప్రజలంతా ఆయన వెంటే ఉంటారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చే తప్పుడు హామీలను జనం నమ్మట్లేదని మల్లారెడ్డి చెప్పారు.