సీఎం కేసీఆర్ లేటెస్ట్ ఫొటో వైరల్..నెట్టింట షేర్ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- సీఎంను మర్యాదపూర్వకంగా కలిసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
- మహబూబ్‌నగర్ అభివృద్ధిపై రూపొందించిన పుస్తకం అందజేత
- ఈ విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా పంచుకున్న మంత్రి
తాజాగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై పూర్తి సమాచారంతో రూపొందించిన ‘పాలమూరు ప్రగతి నివేదిక’ పుస్తకాన్ని సీఎంకు అందించారు. ఈ క్రమంలో దిగిన ఫొటోను ఎక్స్ వేదికగా మంత్రి షేర్ చేశారు.
ఇక, సీఎం కేసీఆర్ అక్టోబర్ 15 నుంచి ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. హుస్నాబాద్‌లో జరిగే భారీ బహిరంగ సభతో ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ రోజు ఉదయం అభ్యర్థులతో సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం బీ ఫాం అందజేస్తారు.