Ambati Rambabu: అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా?: అంబటి రాంబాబు

Ambati Rambabi comments on Nara Lokesh meeting with Amit Shah
షార్ట్స్‌లో చూడండి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ యువనేత నారా లోకేశ్ కలిసిన సంగతి తెలిసిందే. నిన్న సీఐడీ విచారణ ముగిసిన వెంటనే ఆయన హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి నిన్న రాత్రి అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా అక్కడ తెలంగాణ, ఏపీ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి, పురందేశ్వరి కూడా ఉన్నారు. తమపై నమోదైన కేసుల గురించి ఈ సమావేశంలో అమిత్ షాకు లోకేశ్ వివరించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ పై మంత్రి అంబటి రాంబాబు సెటైరిక్ గా ట్వీట్ చేశారు. అమిత్ షాను కలిసింది బీజేపీలో విలీనం కావడానికేగా? అని ఎద్దేవా చేశారు. 


Go Back to Shorts
Ambati Rambabu
YSRCP
Nara Lokesh
Telugudesam
BJP

More Telugu News