Nagarjuna: నాగార్జున 100వ సినిమా దర్శకుడు ఎవరంటే ..!

Nagarjuna in Naveen Movie
షార్ట్స్‌లో చూడండి
నాగార్జున ఒక వైపున 'బిగ్ బాస్' షోతో .. మరో వైపున 'నా సామిరంగ' సినిమాతో బిజీగా ఉన్నారు. కెరియర్ పరంగా నాగార్జునకి 'నా సామిరంగ' 99వ సినిమా. విజయ్ బిన్నీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, చాలావరకూ గ్రామీణ నేపథ్యంలో కొనసాగనుంది. అందువలన ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. 

ఈ నేపథ్యంలో నాగార్జున 100వ సినిమాకి సంబంధించిన విషయాలపై అభిమానులు ఎక్కువ దృష్టి పెట్టారు. మోహన్ రాజా దర్శకత్వంలో నాగార్జున 100వ సినిమా ఉండే ఛాన్స్ ఉండనే టాక్ ఆ మధ్య బలంగా వినిపించింది. కానీ ఇప్పుడు తమిళ దర్శకుడు నవీన్ పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల వచ్చిన 'అగ్ని సిరగుగల్' ఆయనకి మంచి పేరు తెచ్చిపెట్టింది. 

విజయ్ ఆంటోని - అరుణ్ విజయ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఆ సినిమాను ఆయన డీల్ చేసిన తీరు నాగార్జునకి నచ్చిందట. అందువల్లనే ఆయన నవీన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. జ్ఞానవేల్ రాజా ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తాడని అంటున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. 
Go Back to Shorts
Nagarjuna
Naveen
Gnanavel Raja

More Telugu News