చంద్రబాబుతో ఎంపీ కనకమేడల ములాఖత్... జగన్‌పై విమర్శలు
- జగన్ రూ.43వేల కోట్లు దోచుకున్నారన్న టీడీపీ ఎంపీ కనకమేడల
- బెయిల్‌పై బయట ఉన్న వ్యక్తి చంద్రబాబు గురించి మాట్లాడుతున్నారని చురకలు
- చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు సంబంధించి ఒక్క ఆధారం చూపించలేదని వ్యాఖ్య
అలాంటి వ్యక్తి చంద్రబాబు నిజాయతీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుపై చేసిన ఆరోపణలలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక ఆధారాన్ని కూడా చూపలేకపోయారన్నారు. చంద్రబాబుకి ఏ రూపంలో ఎవరి ద్వారా నిధులు ముట్టాయో ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. తమ పార్టీ ఆడిటర్స్ ద్వారా ప్రతి సంవత్సరం లెక్కలు బహిర్గతం చేస్తామన్నారు.