Mahesh Babu: 'గాజు బొమ్మ' సాంగ్ ప్రతి తండ్రి హృదయంలో ప్రతిధ్వనిస్తుంది: మహేశ్ బాబు

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న కొత్త చిత్రం 'హాయ్ నాన్న' నుంచి తాజాగా 'గాజు బొమ్మ' లిరికల్ సాంగ్ విడుదలైంది. ఈ పాట వీడియోను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తన కుమార్తె కోసం ఓ తండ్రి ఆలపించే ఈ గీతం ప్రతి తండ్రి హృదయంలో మార్మోగుతుందని మహేశ్ బాబు పేర్కొన్నారు. ఎంతో హృద్యంగా ఉన్న ఈ గీతం తన హృదయంలోనూ ప్రతిధ్వనిస్తోందని వివరించారు. 'హాయ్ నాన్న' చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్టు వెల్లడించారు. 

'గాజు బొమ్మ' పాటకు మలయాళ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం సమకూర్చారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వయంగా ఆలపించిన ఈ గీతానికి విశేష స్పందన వస్తోంది. మహేశ్ బాబు అభినందనలు తెలపడం పట్ల హేషమ్ అబ్దుల్ వహాబ్ కృతజ్ఞతలు  తెలిపారు. 

వైరా ఎంటర్టయిన్ మెంట్స్ పతాకంపై శౌర్యువ్ దర్శకత్వంలో 'హాయ్ నాన్న' చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
Mahesh Babu
Gaaju Bomma Song
Hai Nanna
Nani

More Telugu News