లండన్‌లోని హీత్రూ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం.. ఫొటోలు ఇవిగో

Warm welcome to Kavitha in London
  • కవితకు స్వాగతం పలికిన బీఆర్ఎస్, జాగృతి మద్దతుదారులు
  • బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆహ్వానం మేరకు లండన్ కు వెళ్లిన కవిత
  • ప్రజాస్వామ్యంలో మహిళల భాగస్వామ్యం అంశంపై ప్రసంగించనున్న కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లండన్ చేరుకున్నారు. లండన్ లోని హీత్రూ ఎయిర్ పోర్టులో ఆమెకు ఘన స్వాగతం లభించింది. బీఆర్ఎస్ పార్టీ, భారత్ జాగృతి అభిమానులు, మద్దతుదారులు తనకు ఘన స్వాగతం పలికారని కవిత ఎక్స్ వేదికగా తెలిపారు. పబ్లిక్ పాలసీకి సంబంధించి ప్రఖ్యాత బ్రిడ్జ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ ఆహ్వానం మేరకు కవిత అక్కడకు వెళ్లారు. లండన్ లోని సెంట్రల్ హాల్ వెస్ట్ మినిస్టర్ లో ఈరోజు 'మహిళా రిజర్వేషన్ చట్టం - ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం' అనే అంశంపై బ్రిడ్జ్ ఇండియా నిర్వహిస్తున్న సదస్సులో కవిత ప్రసంగించనున్నారు. 

Go Back to Shorts
K Kavitha
BRS
London

More Telugu News