Donald Trump: భోంచేసే ప్రతిసారీ ట్రంప్ టెన్షన్ పడేవారట. ఎందుకంటే..!

USA Ex president  Donald Trump Tension About Being Poisioned
  • విషప్రయోగం జరగొచ్చని ట్రంప్ భయపడేవారన్న వైట్ హౌస్ మాజీ ఉద్యోగి కాసిడి హచిన్సన్
  • ఈ భయం వల్లే ఎప్పుడూ తన వెంట చిన్న కెచప్ బాటిల్స్ తీసుకెళతారని వెల్లడి
  • తన కొత్త పుస్తకం ‘ఇనఫ్’ రిలీజ్ సందర్భంగా మాజీ అధ్యక్షుడి భయాలను వెల్లడించిన హచిన్సన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాణభయంతో ఉండేవారని, విషప్రయోగం జరుగుతుందని టెన్షన్ పడేవారని వైట్ హౌస్ మాజీ ఉద్యోగి ఒకరు తాజాగా వెల్లడించారు. ముఖ్యంగా ఆహారంలో మరీ ముఖ్యంగా కెచప్ లో విషం కలిపి తనను చంపే ప్రయత్నం జరగొచ్చని అనుమానించేవారని చెప్పారు. ఈ భయంవల్లే ట్రంప్ నిత్యం తన వెంట చిన్న చిన్న కెచప్ బాటిళ్లను తీసుకెళ్లేవాడని వివరంచారు. ఈమేరకు వైట్ హౌస్ లో ట్రంప్ కు సహాయకురాలిగా పనిచేసిన కాసిడీ హచిన్సన్ ఈ వివరాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

రైటర్ కూడా అయిన కాసిడీ హచిన్సన్ తన కొత్త పుస్తకం ‘ఇనఫ్’ ను ఇటీవలే రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కాసిడీ మాట్లాడుతూ.. తనపై విషప్రయోగం జరగొచ్చని డొనాల్డ్ ట్రంప్ నిత్యం టెన్షన్ పడుతుండే వారని తెలిపారు. ఆయనకు వడ్డించే ఆహారంలో కెచప్ తప్పనిసరిగా ఉంటుందని, ప్రతిసారీ కొత్త కెచప్ బాటిల్ వాడాల్సిందేనని వివరించారు. ఆ కెచప్ లో విషం కలిపే అవకాశం ఉందని ట్రంప్ ఆందోళన చెందడంతో ఇలా చేయాల్సి వచ్చేదన్నారు. దీంతో వంట వాళ్లు హెంజ్ కెచప్ చిన్న బాటిల్స్ కొనుగోలు చేసి ఉంచేవారని కాసిడీ వివరించారు.
Donald Trump
USA
Trump Fear
poisioned
Ketchup
Trump Food

More Telugu News