టాలీవుడ్ లో మరో ప్రేమ జంట.. హీరోయిన్ ను పెళ్లాడబోతున్న రామ్ పోతినేని?
- రామ్, అనుపమ పరమేశ్వరన్ ప్రేమలో ఉన్నట్టు పెద్ద ఎత్తున ప్రచారం
- కొంత కాలంగా రిలేషన్ లో ఉన్నారని ఫిలింనగర్ టాక్
- 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రాల్లో కలిసి నటించిన జంట
కొంత కాలంగా వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని, ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే యోచనలో ఉన్నారని సమాచారం. ఈ వార్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. అయితే ఈ వార్తలపై వీరిద్దరిలో ఎవరూ కూడా ఇంకా స్పందించలేదు. రామ్, అనుపమలు 'ఉన్నది ఒకటే జిందగీ', 'హలో గురూ ప్రేమ కోసమే' చిత్రాలలో కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ మొలకెత్తిందని అంటున్నారు.