ఓటీటీలో ఈ వారం సినిమా: ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
- తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో అక్టోబర్ 6 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్
- హెబ్బా పటేల్ కీలక పాత్రలో సినిమా
- విప్లవ్ కోనేటి దర్శకత్వంలో వస్తోన్న ది గ్రేట్ ఇండియన్ సూసైడ్
చనిపోయిన వ్యక్తిని బతికించుకునేందుకు ఎనిమిది మంది కుటుంబ సభ్యులు ఎంచుకున్న మార్గం... వారు ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డారు? అనే అంశాల ఆధారంగా ఈ సినిమాను తీశారు. 'బళ్లారి నీలకంఠం గారు మా పెదనాన్న.. ఈ విధిని, డెస్టినీని మార్చలేమా అనుకుంటూ ఆయన చావుకు కారణం వెతుకుతుంటే, అనుకోకుండా వారిని బతికించుకునే దారి కనిపించింది. ఆయన కోసం ఆయన ప్రేమించే వాళ్లు, బలంగా కోరుకొని ప్రాణత్యాగం చేస్తే మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందట' అని హెబ్బా పటేల్ కొట్టే డైలాగ్‌కు చెందిన ట్రైలర్ విడుదలైంది.