Elon Musk: అసాల్ట్ రైఫిల్‌తో ఎలాన్ మస్క్ కాల్పులు.. వీడియో ఇదిగో!

Elon Musk fires several rounds from assault rifle calls it Hip firing
  • అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను షేర్ చేసిన ఎలాన్ మస్క్
  • హిప్ ఫైరింగ్ చేస్తున్నానంటూ కామెంట్
  • నెటిజన్ల నుంచి విపరీతంగా రెస్పాన్స్ 
  • క్షణాల్లో వైరల్‌గా మారిన వీడియో
ప్రముఖ టెక్ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అసాల్ట్ రైఫిల్‌తో షూటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మస్క్ స్వయంగా ఈ వీడియోను షేర్ చేశారు. ‘50 క్యాలిబర్ బ్యారెట్ రైఫిల్‌తో హిప్ ఫైరింగ్ చేస్తున్నా’ అంటూ ఓ క్యాప్షన్‌తో ఆయన ఈ వీడియోను షేర్ చేశారు. యాక్షన్ హీరో మాదిరి పోజుతో మస్క్ రైఫిల్ వాడుతున్న వైనం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కోట్లల్లో వ్యూస్, వేలల్లో కామెంట్స్ వచ్చిపడుతున్నాయి. హాలీవుడ్ హీరోలనే మించిపోయావంటూ అనేక మంది కామెంట్ చేశారు. 

కాగా, మస్క్ గతంలోనూ తుపాకీల ఫొటోలను నెట్టింట పంచుకున్నారు. గతేడాది నవంబర్‌లో ఆయన తన మంచం పక్కన టేబుల్‌పై ఉన్న రెండు పిస్టళ్ల ఫొటోలను షేర్ చేశారు. ఇవి నిత్యం మంచం పక్కనే ఉంటాయని అప్పట్లో ఆయన పేర్కొన్నారు. 

అంతకుమునుపు, టెక్సాస్ రాష్ట్రంలోని ఓ ఎలిమెంటరీ స్కూల్లో జరపిన కాల్పుల ఘటనపై కూడా మస్క్ స్పందించారు. అసాల్ట్ రైఫిల్ వినియోగంపై ఆంక్షలు విధించాలని అభిప్రాయపడ్డారు. ఈ రైఫిల్‌ కొనుగోలుకు ప్రత్యేక పర్మిట్ విధానం అమలు చేయాలని సూచించారు. కొనుగోలుదారుడి గతం గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఈ పర్మిట్ జారీ చేయాలని చెప్పుకొచ్చారు. ఎలిమెంటరీ స్కూల్ కాల్పుల ఘటనలో ఏకంగా 19 చిన్నారులు మృతి చెందారు. అసాల్ట్ రైఫిల్‌తో స్కూల్లోకి వచ్చిన దుండగుడు చిన్నారులపై విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో వారంతా అక్కడికక్కడే మరణించారు.
Elon Musk
Viral Videos

More Telugu News