వన్డే ప్రపంచకప్ కు ముందు షమీకి ఊరటనిచ్చిన కోర్టు

వన్డే ప్రపంచకప్ కు ముందు షమీకి ఊరటనిచ్చిన కోర్టు

Court grants bail to Mohammed Shami
  • షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్ జహాన్
  • కోర్టుకు తొలిసారి వ్యక్తిగతంగా హాజరైన షమీ
  • షమీకి బెయిల్ మంజూరు చేసిన కోర్టు
అక్టోబర్ 5 నుంచి ఇండియాలో జరగనున్న వన్డే ప్రపంచకప్ కు సిద్ధమవుతున్న టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీకి అలీపూర్ కోర్టు ఊరటను కలిగించింది. గృహ హింస కేసులో ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. షమీ భార్య హసీన్ జహాన్ 2018లో ఆయనతో పాటు మరికొందరు కుటుంబ సభ్యులపై జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు వీరిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ క్రమంలో ఈ కేసులో షమీ తొలిసారి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరయ్యాడు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరాడు. షమీ విన్నపం పట్ల సానుకూలంగా స్పందించిన జడ్జి... షమీకి బెయిల్ మంజూరు చేశారు. రూ. 2 వేల పూచికత్తుపై బెయిల్ ఇచ్చింది. 
Advertisement
Mohammed Shami
Team India
Bail

More Telugu News