ఫేస్‌బుక్ ద్వారా పరిచయం.. ఆపై ఇంటికి ఆహ్వానించి నిలువు దోపిడీ
- ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఘటన
- సన్నిహితంగా ఉన్నట్టు నటిస్తూ వీడియోలు, ఫొటోలు
- ఆపై వాటిని చూపించి డబ్బులు, బంగారం గుంజుకొంటున్న ముఠా
- ఇప్పటికే వారిపై మరిన్ని కేసులు
వచ్చిన వారిని గదిలోకి తీసుకెళ్లి సన్నిహితంగా ఉన్నట్టు నటించేది. అప్పటికే ఆ గదిలో రహస్యంగా ఉన్న వారు వీడియోలు, ఫొటోలు తీసేశారు. ఆ తర్వాత వాటిని చూపించి బ్లాక్‌మెయిల్‌కు దిగి వారి వద్దనున్న డబ్బు, బంగారం దోచుకునేవారు. అలాగే, భువనేశ్వర్‌కే చెందిన ఓ యువకుడి భార్యకు ఎయిమ్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి రూ. 3.60 లక్షలు కాజేసినట్టు నిందితులపై మరో కేసు కూడా నమోదైంది. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడయ్యాయి. వారిపై వివిధ పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే పలు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.