హైదరాబాద్, బెంగళూరుల్లోని ఆ ఉద్యోగులందరికీ నారా లోకేశ్ థ్యాంక్స్
- హైదరాబాద్, బెంగళూరు సహా వివిధ నగరాల్లో చంద్రబాబుకు మద్దతుగా ఉద్యోగుల నిరసన
- ఎక్స్ వేదికగా వివిధ నగరాలకు చెందిన నిరసన ఫోటోలను పంచుకున్న లోకేశ్
- మీలో ప్రతి ఒక్కరికీ ఎప్పటికీ రుణపడి ఉంటామని వ్యాఖ్య
చంద్రబాబుకు మద్దతుగా హైదరాబాద్, బెంగళూరు, ఇతర నగరాలు లేదా పట్టణాలలో రోడ్లపైకి వచ్చిన వేలాదిమంది ఐటీ ఉద్యోగులకు నేను అభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. బేషరతుగా మీ ప్రేమ, ఆప్యాయతలను కురిపించినందుకు మీలో ప్రతి ఒక్కరికీ మేం ఎప్పటికీ రుణపడి ఉంటామని పేర్కొన్నారు. వీరందరికీ తన హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ ముగించారు.
ఏపీలో అవినీతిపరులైన పాలకులు, నీతిపరులను జైలుకు పంపుతున్నారని, స్కిల్ డెవలప్‍మెంట్ ప్రాజెక్టులో ఎలాంటి స్కామ్ లేదని, ప్రభుత్వం కావాలని తప్పుడు కేసులో చంద్రబాబును ఇరికించిందని మరో ట్వీట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.