Angvastram: జీ20 నేతలకు అంగవస్త్రం బహూకరించిన మోదీ.. దాని వెనకున్న కథ ఇదీ!

Angvastram given to G20 leaders was made in Jalesar
షార్ట్స్‌లో చూడండి
ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సుకు హాజరైన దేశాధి నేతలకు భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ‘అంగవస్త్రం’తో స్వాగతం పలికారు. ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఖాదీ వస్త్రానికి, ప్రధాని ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి సంబంధం ఉండడం విశేషం. దీనిని ఉత్తరప్రదేశ్‌లో జలేశ్వర్ ప్రాంతంలోని ఓ ఫ్యాక్టరీలో తయారుచేశారు. 

‘జ్యోతి గ్రీన్’ ఫ్యాక్టరీలో తయారుచేసిన ఈ అంగవస్త్రాన్ని ప్రధాని మోదీ జీ20 నేతలకు బహూకరించారు. జ్యోతి గ్రీన్ కంపెనీని అంకిత్ సిసోడియా స్థాపించారు. ప్రధాని మన్ కీ బాత్ స్ఫూర్తితో ఆయనీ ఫ్యాక్టరీని స్థాపించారు. ఎంబీఏ చేసిన సిసోయిడా తొలుత ఏడాదిపాటు ఓ బహుళజాతి కంపెనీలో పనిచేశారు.

ప్రధాని మన్ కీ బాత్ విన్న తర్వాత సొంతంగా వ్యాపారం చేసుకోవాలని నిర్ణయించుకుని ఈ ఫ్యాక్టరీని స్థాపించారు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా ఆధునిక పద్ధతిలో ఖాదీ వస్త్రాలను తయారుచేయాలన్న లక్ష్యంతో ఐదేళ్ల క్రితం ఆయన ఫ్యాక్టరీ ప్రారంభించారు. జలేశ్వర్‌లో ఉన్న ఈ ఫ్యాక్టరీ దేశంలోనే తొలి సోలార్ ఖాదీ యూనిట్.
Go Back to Shorts
Angvastram
G20
Narendra Modi
Ankit Sisodia
Jyoti Green

More Telugu News