మూడు రోజులుగా నన్ను ఇబ్బంది పెడుతున్నారు: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

Kotamreddy Sridhar Reddy fires on police
  • తాను నివాసం ఉంటున్న మాగుంట లేఔట్ ను అష్టదిగ్బంధం చేశారన్న కోటంరెడ్డి
  • తన కోసం వందలాది కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని వ్యాఖ్య
  • తన సిబ్బందిని కూడా రాకుండా చేస్తున్నారని మండిపాటు
చంద్రబాబు అరెస్ట్, రిమాండ్ నేపథ్యంలో రాష్ట్ర బంద్ కు టీడీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులపై కోటంరెడ్డి నిప్పులు చెరిగారు. తాను నివాసం ఉంటున్న మాగుంట లేఔట్ ను అష్టదిగ్బంధం చేశారని ఫైర్ అయ్యారు. మూడు రోజుల నుంచి తనను నిర్బంధించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. తన కోసం వందలాది కుటుంబాలను ఇబ్బంది పెట్టొద్దని ఆగ్రహం వ్యక్తం చేశారు. గృహ నిర్బంధం పేరుతో తన సిబ్బందిని కూడా రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎక్కడికీ వెళ్లనని... ఉంటే ఇంట్లో ఉంటానని, లేకపోతే ఆఫీస్ కు వెళ్తానని చెప్పారు. ఏ పోలీస్ స్టేషన్ కు రమ్మన్నా వస్తానని అన్నారు. తన కోసం ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దని కోరారు. 
Advertisement
Kotamreddy Sridhar Reddy
Telugudesam
House Arrest

More Telugu News