భారత్ లో జీ-20 భేటీకి మా ప్రధాని వస్తారు: చైనా ప్రకటన
- చైనా అధ్యక్షుడు రావడం లేదని తేల్చేసిన డ్రాగన్
- సరిహద్దు విభేదాల నేపథ్యంలో జిన్ పింగ్ డుమ్మా
- తన స్థానంలో ప్రధాని లీకియాంగ్ ను పంపుతున్న జిన్ పింగ్
‘‘భారత ప్రభుత్వం ఆహ్వానం మేరకు స్టేట్ కౌన్సిల్ ప్రధాని లీ కియాంగ్, ఢిల్లీలో సెప్టెంబర్ 9, 10వ తేదీల్లో జరిగే 18వ జీ-20 సదస్సుకు హాజరుకానున్నారు’’ అని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ ప్రకటన విడుదల చేశారు. నిజానికి తమ అధ్యక్షుడు జీ-20 సదస్సుకు రావడం లేదని చైనా ఈ నెల 2నే సమాచారం ఇచ్చింది. ఇందుకు సంబంధించి లిఖిత పూర్వక సమాచారం ఇవ్వలేదు. తమ అధ్యక్షుడు ఎందుకు రావడం లేదన్న దానిపై చైనా ఎలాంటి సమాచారం ఇవ్వలేదు.