తండ్రి అయిన జస్ప్రీత్ బుమ్రా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తండ్రి అయిన జస్ప్రీత్ బుమ్రా

Jasprit Bumrah Sanjana Ganesan welcome first child
  • మగ శిశువుకు జన్మనిచ్చిన సంజనా గణేశన్
  • ట్విట్టర్ లో విషయాన్ని ప్రకటించిన బుమ్రా
  • తమ హృదయాలు నిండుదనాన్ని సంతరించుకున్నాయంటూ పోస్ట్
ప్రముఖ క్రికెటర్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా తండ్రి అయ్యాడు. బుమ్రా భార్య సంజనా గణేశన్ సోమవారం ఉదయం మగ శిశువుకు జన్మనిచ్చింది. బుమ్రా దంపతులకు ఇదే తొలి సంతానం. పట్టరాని సంతోషంతో బుమ్రా ఈ విషయాన్ని ట్విట్టర్ ప్లాట్ ఫామ్ పై (ఎక్స్) పంచుకున్నాడు. ఆసియా కప్ కోసం శ్రీలంకకు వెళ్లిన బుమ్రా, భార్య ప్రసవం నేపథ్యంలో తిరిగి వెనక్కి వచ్చేశాడు. 

‘‘మా చిన్న కుటుంబం పెద్దగా మారింది. మా హృదయాలు నిండుదనాన్ని సంతరించుకున్నాయి. ఈ ఉదయం మేము మా చిన్నారి బాలుడిని (అంగద్ జస్ప్రీత్ బుమ్రా) ఈ ప్రపంచంలోకి ఆహ్వానం పలికాం. మేం ఆనందడోలికల్లో విహరిస్తున్నాం. మా జీవితంలో ఈ కొత్త అధ్యాయం గురించి మరింత వేచి చూడలేం’’ అంటూ జస్ప్రీత్ బుమ్రా పోస్ట్ పెట్టాడు. తమ కుమారుడి చేతి పక్కనే బుమ్రా దంపతులు చేతులు ఉంచి తీసిన ఫొటోను పంచుకున్నాడు.
Advertisement
Jasprit Bumrah
first child
delivered

More Telugu News