Asia Cup: ఆసియాకప్: కొలంబోలో వారంపాటు భారీ వర్షాలు.. మరో వేదికకు మ్యాచ్‌ల తరలింపు!

ACC wants to change venues of super 4 matches to Dambulla from Colombo
షార్ట్స్‌లో చూడండి
ఆసియాకప్‌లో భాగంగా కొలంబోలో జరగాల్సిన మ్యాచ్‌లను మరో వేదికకు తరలించాలని ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయించినట్టు తెలుస్తోంది. వచ్చే వారంపాటు కొలంబోలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అక్కడ జరగాల్సిన సూపర్ ఫోర్ మ్యాచ్‌లను మరో స్టేడియంలో నిర్వహించాలని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

ఈ నెల 9 నుంచి ఐదు సూపర్-4 మ్యాచ్‌లు కొలంబోలో జరగాల్సి ఉంది. వర్షాలు కురవనున్నాయన్న హెచ్చరికలతో అప్రమత్తమైన ఏసీసీ వాటిని దంబుల్లాలోకానీ, లేదంటే పల్లెకెలోలో కానీ నిర్వహించాలని యోచిస్తోంది. ఈ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
Go Back to Shorts
Asia Cup
Sri Lanka
Colombo
Dambulla
Pallekele
ACC
BCCI

More Telugu News