ఆగస్టులో ముఖం చాటేసిన వరుణుడు.. 122 ఏళ్లలో అత్యల్ప వర్షపాతం
- జులైలో భారీ వర్షాలతో బెంబేలు
- ఆగస్టులో చుక్క వాన కరవు
- 1968 తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదు
ఈ ఆగస్టులో దక్షిణ భారతదేశంలో 190.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా సాధారణం కంటే ఏకంగా 60శాతం తక్కువగా 76.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. గత 122 సంవత్సరాల్లో ఇదే అత్యల్పం. అంతకుముందు 1968లో ఇదే నెలలో 89.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణశాఖ తెలిపింది.