ఆసియాకప్: బంగ్లాదేశ్‌ను తేలిగ్గా ఓడించి క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సాధించిన శ్రీలంక
- బంగ్లాదేశ్‌పై అలవోక విజయం సాధించిన శ్రీలంక
- వరుసగా 11 వన్డేల్లో గెలుపుతో రికార్డు
- తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా
ఆసియాకప్‌లో భాగంగా పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 42.4 ఓవర్లలో 164 పరుగులకే కుప్పకూలింది. శ్రీలంక 39 ఓవర్లలో 5 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. సదీరా సమరవిక్రమ (54), చరిత్ అసలంక (62, నాటౌట్) అర్ధ సెంచరీలు చేశారు. నాలుగు వికెట్లు తీసిన మతీశా పథిరనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.