Pawan Kalyan: ‘ఓజీ’ టీజర్ రిలీజ్‌కు టైం మీరే చెప్పండి.. పవన్​ ఫ్యాన్స్‌ను కోరిన నిర్మాణ సంస్థ

OG Team asks fans to decide the Glimpse release time
షార్ట్స్‌లో చూడండి
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, యువ దర్శకుడు సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ‘ఓజీ’. సాహో తర్వాత ఐదేళ్లు విరామం తీసుకున్న సుజీత్‌ ఈ చిత్రంతో తన సత్తా చూపెట్టుకోవాలని పట్టుదలగా ఉన్నాడు. పోస్టర్‌‌ తోనే సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాడు. ఈ చిత్రంలో పవన్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించనున్నారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కానుకగా సినిమా టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్మెంట్ స్పష్టం చేసింది.

అంతేకాదు ఆ రోజు ఏ సమయంలో టీజర్ ను విడుదల చేయాలో చెప్పాలంటూ అభిమానులను అడిగింది. ‘ఆ రోజంతా పండగే కాబట్టి మేరే చెప్పండి సెప్టెంబర్ 2న ఏ టైమ్‌కి విడుదల చేద్దామో? ఫ్యాన్స్ అందరి స్పందన చూసి ఈ రోజు సాయంత్రానికి ఫైనల్ గా ఒక టైం ఫిక్స్ అవుదాం’ అని ట్వీట్ చేసింది. ఈ సినిమాలో తమిళ నటుడు అర్జున్‌ దాస్‌ కీలకపాత్ర పోషిస్తున్నాడు. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్‌ సరసన ప్రియాంక మోహన్‌ నటిస్తోంది.
Go Back to Shorts
Pawan Kalyan
sujeeth
Tollywood
teaser
sep2

More Telugu News