పవర్​ఫుల్​ యాక్షన్​తో షారుక్​​ ‘జవాన్’​ తెలుగు ట్రైలర్ వచ్చేసింది

 Shah Rukh Khan Jawan Official Telugu Trailer
  • అట్లీ కుమార్ దర్శకత్వలో వస్తున్న చిత్రం
  • నయనతార, దీపిక, విజయ్ సేతుపతి కీలక పాత్రలు
  • సెప్టెంబర్ 7న విడుదల కానున్న సినిమా
బాలీవుడ్ అగ్ర నటుడు షారుక్ ఖాన్, తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తో చేస్తున్న చిత్రం ‘జవాన్‌’. హిందీతో పాటు పలు దక్షిణాది భాషల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. షారుక్ సరికొత్త లుక్స్‌ లో కనిపిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తాజాగా అన్ని భాషల్లో ఈ రోజు సినిమా ట్రైలర్స్ విడుదలయ్యాయి. ‘అనగనగా ఒక రాజు.. ఒకదాని తర్వాత ఒకటి యుద్ధం ఓడిపోతూనే ఉన్నాడు’ అంటూ వాయిస్ ఓవర్ తో మొదలైన తెలుగు ట్రైలర్ థ్రిల్లర్ యాక్షన్ సన్నివేశాలతో ఆకట్టుకుంటోంది. 

జవాన్ పాటు పలు పాత్రల్లో షారుక్ మెప్పించారు. ఈ ట్రైలర్ లో నయనతార, దీపిక పదుకొణే, ప్రియమణితో పాటు విలన్ విజయ్ సేతుపతి క్యారెక్టర్లు చూపెట్టారు. ఆయుధాల డీలర్ పాత్రలో సేతుపతి కనిపించనున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ ఏడో తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Go Back to Shorts
Bollywood
Shahrukh Khan
Nayanthara
atlee
Deepika Padukone
Vijay Sethupathi

More Telugu News