ఇబ్బంది కలిగిస్తున్నందుకు క్షమించండి.. ఢిల్లీ వాసులకు ప్రధాని మోదీ విజ్ఞప్తి!
- జీ20 సదస్సు కోసం ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
- పలు రూట్లలో వాహనాల దారిమళ్లింపు
- అసౌకర్యం కలుగుతుందంటూ ముందే క్షమాపణ అడిగిన ప్రధాని
సెప్టెంబర్ 7, 8, 9 తేదీలలో ఢిల్లీలో జీ20 సమిట్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రపంచ నేతలు ఢిల్లీకి వస్తారని చెప్పారు. దేశంలోని వివిధ నగరాలలో జీ20 సమిట్ కార్యక్రమాలు జరిగాయని, వచ్చే నెలలో ఢిల్లీలో జరగబోయే కార్యక్రమాలతో సదస్సు ముగుస్తుందని మోదీ వివరించారు. ఈ సదస్సును విజయవంతం చేయాలంటూ ఢిల్లీ ప్రజలకు ఈ సందర్భంగా ప్రధాని పిలుపునిచ్చారు. ప్రపంచ నేతలకు ఆతిథ్యం ఇచ్చే క్రమంలో దేశ ప్రతిష్ఠపై ప్రభావం పడకుండా చూసుకోవాలని కోరారు.