Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

లైవ్ చాట్ లో హీరో కార్తికేయకు ఊహించని అనుభవం!

Hero Kartikeya was threatened by a woman in live chat
Advertisement
  • ట్విట్టర్ లో అభిమానులతో ముచ్చటించిన కార్తికేయ
  • కార్తికేయను దాదాపు బెదిరించిన ఓ యువతి
  • ఆందోళన చెందిన కార్తికేయ!
  • అమ్మో వద్దు... వద్దు అంటూ విన్నపం
Advertisement
సోషల్ మీడియా వచ్చాక సినీ నటులు తమ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు వీలవుతోంది. హీరోలు, హీరోయిన్లు తరచుగా లైవ్ చిట్ చాట్ లు నిర్వహిస్తూ, ఫ్యాన్స్ తో ముచ్చటించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. 

అయితే, టాలీవుడ్ యువ నటుడు కార్తికేయ కూడా ఇలాగే లైవ్ చాట్ నిర్వహించగా, ఓ యువతి నుంచి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ యువతి దాదాపు బెదిరించినంత పనిచేసింది. అభిమానులు అడుగుతున్న ప్రశ్నలకు కార్తికేయ జవాబు ఇస్తుండగా... ఓ యువతి "రిప్లయ్ ఇవ్వకపోతే చేయి కోసుకుంటా" అంటూ ట్వీట్ చేసింది. ఆమె తీరు గమనించిన కార్తికేయ ఆందోళనకు గురయ్యాడు. "అమ్మో వద్దు... వద్దు" అంటూ వారించాడు. ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.  
Advertisement
Advertisement
Kartikeya
Live Chat
Woman
Social Media

More Telugu News