టీవీని సైతం పిండిని చేసే బాహుబలి మిక్సర్ గ్రైండర్.. వీడియో!
- ముగ్గురు వ్యక్తుల తయారీ
- మిక్సర్ జార్ లో టెలివిజన్ పెట్టి స్విచ్ ఆన్
- ముక్కలుగా చేసేసిన జార్
మిక్సర్ జార్ పారదర్శకంగా ఉండి, అందులోని బ్లేడ్ కూడా బయటకు కనిపిస్తోంది. ముగ్గురు వ్యక్తులు దీన్ని తయారు చేశారు. జార్ పై నుంచి టీవీని తాడుతో వేలాడదీసి ఉంచారు. 20 అడుగుల దూరంలో ఆన్, ఆఫ్ బటన్ ని ఏర్పాటు చేశారు. వీటి గురించి వివరించిన తర్వాత ఓ వ్యక్తి వెళ్లి మిక్సర్ ను ఆన్ చేయడం ఆలస్యం.. అందులోని టీవీ కింద పడి ముక్కలు కావడాన్ని చూడొచ్చు. ఈ వీడియోకి ఇప్పటికే 4 లక్షల వ్యూస్ వచ్చేశాయి. వీడియో చూసిన వారు స్పందించకుండా ఉండలేకపోతున్నారు. తమకు నచ్చిన రీతిలో, నవ్వు తెప్పించే విధంగా కామెంట్లు పెడుతున్నారు. (వీడియో కోసం)