హైదరాబాద్ లో బెగ్గర్ ఆదాయం ఎంతో తెలిస్తే.. షాక్ అవ్వాల్సిందే!

22-08-2023 Tue 12:19 | Telangana
Advertisement
  • ఓ కుటుంబానికి అడ్డాగా ఒక ట్రాఫిక్ కూడలి 
  • రెడ్ సిగ్నల్ పడితే అందరూ కలసి అడుక్కోవడం
  • ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే డ్యూటీ
  • నెల మొత్తం మీద రూ.2 లక్షల ఆదాయం
  • ఒక్కొక్కరికీ రూ.200 చెల్లిస్తున్న బెగ్గింగ్ మాఫియా
Advertisement
ట్రాఫిక్ కూడళ్ల వద్ద రెడ్ సిగ్నల్ పడిన వెంటనే వాహనాలు నిలిచిపోతాయి. అంతలోనే నలు వైపుల నుంచి యాచకులు ధర్మం, దానం అంటూ చేయి చాపుతూ ప్రతీ వాహనదారుడి వద్దకు వెళ్లి అడగడం భాగ్యనగర వాసులు నిత్యం ఎదుర్కొనే అనుభవమే. మాసిపోయిన వస్త్రాలు ధరించి యాచించే వీరికి అందరూ కాకపోయినా కొందరైనా దానం చేస్తుంటారు. ఇలా అడుక్కునే వారికి నెలలో ఎంత ఆదాయం వస్తుందో తెలుసా..? దీని గురించి ఎవరూ ఆలోచించి ఉండరు. 

యాచనను వృత్తిగా చేసుకున్న ఓ కుటుంబం నెల మొత్తం మీద రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు సంపాదిస్తోంది. బెగ్గర్ మాఫియాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు యాచకులను ప్రశ్నించినప్పుడు విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ కమిషనరేట్ల పరిధిలోని ట్రాఫిక్ జంక్షన్ల వద్ద యాచించే వారు ముఠాలో భాగం. ఒక్కో కూడలిని ఒక కుటుంబం అడ్డాగా చేసుకుని యాచిస్తున్నట్టు తెలిసింది.

భార్యా, భర్త, నలుగురు లేదా ఐదుగురు పిల్లలు కలసి ఓ కూడలి వద్ద యాచిస్తున్నారు. అక్కడికి వేరొక వ్యక్తిని యాచించేందుకు వీరు అనుమతించరు. రోజువారీ వీరంతా కలసి ఓ కూడలి వద్ద రూ.4,000 నుంచి రూ.7,000 వరకు సంపాదిస్తున్నారు. మరీ ముఖ్యంగా ప్యారడైజ్, ట్యాంక్ బండ్, జూబ్లిహిల్స్ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్, మసాబ్ ట్యాంక్, అబిడ్స్ రోడ్, కోటి ఉమెన్స్ కాలేజ్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం కూడళ్లకు డిమాండ్ ఎక్కువ. వివాదం ఏర్పడినప్పుడు పెద్దలు రంగంలోకి దిగి పరిష్కరిస్తారట. కుటుంబం అంతా కలసి ఉదయం ట్రాఫిక్ కూడలికి చేరుకుని, రాత్రి వరకు అక్కడే ఉండి తిరిగి ఆటోలో వెళ్లిపోతున్నట్టు పోలీసులు వెల్లడించారు. 

వీరందరినీ మాఫియా ముఠా నడిపిస్తోందని వెల్లడైంది. వికలాంగులు, పిల్లలు, పెద్దలను డబ్బు ఆశ చూపించి తీసుకొచ్చి యాచన చేయిస్తున్నట్టు గుర్తించారు. ప్రతి ఒక్క యాచకుడు లేదా యాచకురాలికి రోజు మొత్తం మీద ధర్మం పేరుతో సంపాదించినందుకు రూ.200 వరకు మాఫియా చెల్లిస్తోంది. వారికి ఆహారం, వసతి ఏర్పాటు చేస్తున్నారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన 28 ఏళ్ల అజిత్ పవార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడు 23 మందితో యాచన చేయిస్తున్నట్టు వెలుగు చూసింది. అతడి నుంచి ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుతో కర్ణాటకలో ఆస్తులు పోగేసుకుంటున్నట్టు తెలిసింది.
Advertisement
BeggarsHyderabadtraffic signalsjunctionsearns

More Telugu News

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55
..more