సీఎం జగన్‌కు వైద్య పరీక్షలు

CM jagan attends medical examinations in Vijayawada
  • కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న సీఎం జగన్
  • సోమవారం విజయవాడలోని ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌లో పరీక్షలు
  • ఎమ్మారైతో పాటూ వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టు సమాచారం. 
  • పరీక్షల సందర్భంగా జగన్ వెంటే ఆయన భార్య 
  • పరీక్షల అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన సీఎం
కొన్ని రోజులుగా కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సోమవారం వైద్య పరీక్షలు చేయించుకున్నారు. విజయవాడలోని ఓ డయాగ్నస్టిక్ ల్యాబ్‌లో ఈ పరీక్షలు చేయించుకున్నారు. నిన్న మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో మొగల్రాజపురంలోని ఓ డయాగ్నొస్టిక్ సెంటర్‌కు వెళ్లారు. 

ఎమ్మారై స్కాన్‌తో పాటూ ఆయన వివిధ రకాల పరీక్షలు చేయించుకున్నట్టు తెలుస్తోంది. ల్యాబ్‌లో ఆయన సుమారు రెండు గంటలపాటు ఉన్నట్టు సమాచారం. ఈ సందర్భంగా జగన్ వెంట ఆయన భార్య భారతి రెడ్డి కూడా ఉన్నారు. పరీక్షల అనంతరం జగన్ మూడు గంటలకు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వెళ్లారు.
Go Back to Shorts
YS Jagan
Vijayawada
Andhra Pradesh
YSRCP

More Telugu News