టిక్కెట్ రాకపోవడంతో కాంగ్రెస్‌లోకి రేఖా నాయక్?
- ఖానాపూర్ టిక్కెట్ ఇవ్వని బీఆర్ఎస్ అధిష్ఠానం
- రేఖా నాయక్ కాంగ్రెస్‌లోకి వెళ్తారని జోరుగా ప్రచారం
- ఇప్పటికే రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన రేఖా నాయక్ భర్త
ఇప్పటికే ఆమె భర్త అజ్మీరా శ్యామ్ నాయక్ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో రేపు రేఖా నాయక్ కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు లేదా రేపు కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రేను ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కలిసే అవకాశముందని తెలుస్తోంది. టిక్కెట్ పై హామీ తీసుకొని పార్టీలో చేరుతారని తెలుస్తోంది.