ram pothineni: ‘స్కంద’ ట్రైలర్ లోడింగ్.. వేడుక, వేదిక ఖరారు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో పోతినేని రామ్ హీరోగా తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్‌‌టైనర్ ‘స్కంద’. అండాల నటి శ్రీలీల ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 15న ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, టైటిల్ గ్లింప్స్ తో రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమా నుంచి తాజాగా మరో అప్ డేట్ వచ్చింది. 

సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ తేదీ, వేదిక ఖరారయ్యాయి. ఈ నెల 26న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగే భారీ ఈవెంట్‌లో ట్రైలర్‌‌ను విడుదల చేయనున్నారు. తమన్ సంగీతం అందించిన సినిమాను జీ స్టూడియోస్ సమర్పణలో శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. రామ్ కెరీర్‌‌లో మొదటిసారి వస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే కావడం విశేషం.
ram pothineni
sreeleela
Boyapati Sreenu
skanda
trailer

More Telugu News