యువ నటి శ్రీలీలకు ప్రతి నెలా పండగే
- టాలీవుడ్‌లో బిజీగా యువ హీరోయిన్
- శ్రీలీల చేతిలో ఎనిమిది ప్రాజెక్టులు
- సెప్టెంబర్ నుంచి నెలకో సినిమా విడుదల
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ మాస్ ఎంటర్‌టైనర్ సెప్టెంబర్ 15న విడుదల కాబోతోంది. బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘భగవంత్ కేసరి’లో శ్రీలీల కీలకపాత్ర పోషిస్తోంది. ఈ సినిమా అక్టోబర్ 19న ఈ చిత్రం విడుదల కానుంది. మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ తో నటిస్తున్న ‘ఆదికేశవ’ చిత్రం నవంబర్ 10న విడుదల కానుంది. నితిన్‌కు జంటగా నటిస్తున్న ‘ఎక్స్ ట్రా’ చిత్రం డిసెంబర్ 23న విడుదల కాబోతోంది. ఇక, త్రివిక్రమ్–మహేష్ బాబు కాంబినేషన్ లో ‘గుంటూరు కారం’ వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. వీటితో పాటు పవన్ కల్యాణ్, విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి సినిమాలు శ్రీలీల చేతిలో ఉన్నాయి.